బాలికపై అత్యాచారయత్నం చేసిన ఉపాధ్యాయుడు జి.చంద్రశేఖర్‌ను జిల్లా విద్యాధికారి రవికాంత్‌రావు సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేటకు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జి.చంద్రశేఖర్ పట్టణంలోని 17 ఏళ్ల బాలికపై గురువారం అత్యాచారయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సస్పెన్షన్ ద్వారా అతనిపై చర్యలకు ఉపక్రమించింది. పోలీసు అధికారులు ఉపాధ్యాయుడిని రిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రామేశ్వర్ మాట్లాడుతూ సంఘటనపై విచారణ చేపట్టామని, బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచార యత్నం చేసినట్లు తేలిందన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ నందీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa