పూరి జగన్నాథ్ రోగ్ సినిమా మొదలుపెట్టి చాలా కాలమైంది. చాన్నాళ్ల పాటు ఆ సినిమాకు సంబంధించి అప్ డేట్స ఏమీ లేవు. దీంతో పూరి గత సినిమాలకు వచ్చినట్లు దీనికి బజ్ ఏమీ రాలేదు. ఐతే ఓ మూడు వారాల నుంచి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకతో జనాలందరి అటెన్షన్ రాబట్టుకోవాలని ప్లానింగ్ కొంచెం పెద్ద ఎత్తునే చేశారు. ఏకంగా సన్నీ లియోన్ నే ఈ వేడుకకు రప్పించారు. ఆమెతో డ్యాన్స కూడా చేయించారు. కానీ దాని వల్ల ఆశించిన ఫలితమైతే కనిపించినట్లుగా లేదు.
సన్నీ లియోన్ డ్యాన్స అదీ చూస్తే చాలా మామూలుగా అనిపించింది. రోగ్ సినిమా హీరోయిన్లద్దరూ కూడా స్టేజ్ మీద రచ్చ చేయడం.. పూరి కనెక్ట్స ద్వారా ప్రమోట్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఈ వేడుకలో హైలైట్ కావడంతో వాళ్ల మధ్య సన్నీ ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. మిగతా వాళ్లందరినీ పక్కనబెట్టే సన్నీనే హైలైట్ చేసి.. ఆమెతో మరింత బాగా రిహార్సల్స చేయించి.. ఆమెకేదైనా హాట్ హాట్ డ్రెస్ చేసి ఉంటే కథ మరోలా ఉండేదేమో. కానీ అంత మంది మధ్య.. తన శైలికి భిన్నంగా మామూలు అమ్మాయిల్లాగే నిండుగా కప్పుకుని సన్నీ డ్యాన్స చేసేసరికి జనాలకు కిక్కు రాలేదు. సన్నీని తీసుకురావడం వల్ల ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణేమీ చేకూరలేదు. సన్నీ తనకు సంబంధం లేని ఒక వేడుకకు వచ్చి డ్యాన్స చేయాలంటే భారీ స్థాయిలో పారితోషకం తీసుకుంటుంది. రోగ్ నిర్మాత సి.ఆర్.మనోహర్ ఆమెకు భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కానీ దాని వల్ల ఆశించిన ప్రయోజనమైతే దక్కలేదన్నది ఈ వేడుక చూసన వాళ్ల మాట.