యూపీ : తోటి విద్యార్థి తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నాడని 9వ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. మీరట్ లో బాలిక చదువుతున్న స్కూల్‌లోనే సదరు బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఆ వ్యక్తి తనను అత్యాచారం చేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడని బాలిక పోలీసులను ఆశ్రయించింది. మా నాన్నకు ఫోన్ చేస్తూ తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాలిక పోలీసులకు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా..అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తనను వేధిస్తున్న తోటి విద్యార్థికి తగిన గుణపాఠం చెప్పి, శిక్షించాలని బాలిక విజ్ఞప్తి చేస్తుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa