ముంబై: రైల్వే విభాగంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళన బాట పట్టారు. విద్యార్థులు ముంబైలోని మతుంగ-ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ మార్గాల వద్ద రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa