ముంబై: ఈ మధ్య కాలంలో సెల్ఫీల గోల ఎక్కువైంది. సెలబ్రిటీలు కనపడితే వారితో సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీలు పడతా రు. తాజాగా ఈ సెల్ఫీ గోలకు బాధితురాలిగా మారింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. వివరాల్లోకి వెళ్తే, వచ్చే నెలలో విద్య నటించిన 'బేగమ్ జాన్' సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల ఆ సినిమా నిర్మాత మహేష్ భట్, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీలతో కలసి కోల్ కతా ఎయిర్ పోర్టులోకి వెళుతోంది విద్యాబాలన్. ఇంతలో, ఓ వ్యక్తి అక్కడకు పరుగుపరుగున వచ్చి ఓ సెల్ఫీ కావాలంటూ విద్యను అడిగాడు. దీనికి ఆమె ఓకే చెప్పింది. దీంతో, అతను చొరవగా ఆమె భుజంపై చేయి వేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. అతడి చర్యతో షాక్ కు గురైన విద్య... చేయి తీయమని చెప్పింది. అతను వినపడనట్టే చేతిని అలాగే ఉంచాడు. దీంతో, ఆమె మేనేజర్ వచ్చి చేయి తీసేయమని చెప్పాడు. దీంతో అతను చేయి తీసేశాడు. ఆ తర్వాత సెల్ఫీ కోసం ఫోన్ వైపు చూసింది విద్య. కానీ, అతని చేయి తన వీపుపై కదులు తున్నట్టు గ్రహించిన విద్య... తీవ్ర ఆగ్రహానికి గురైంది. నీవేం చేస్తున్నావో తెలుస్తోందా? ఏమనుకుంటున్నావ్? అంటూ అతనిపై విరుచుకు పడింది. ఆ తర్వాత కూడా అతను సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే... సెల్ఫీ వద్దు, బిహేవ్ యువర్ సెల్‌ఫ అంటూ మండిపడింది. ఆ తర్వాత ఈ ఘటన పై ఆమె స్పందిస్తూ, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మన మీద చేయి వేస్తే ఎంతో అసౌ ర్యంగా ఉంటుందని విద్య చెప్పింది. అతను అలాగే హద్దు మీరాడు అంటూ మండిపడింది. తాము పబ్లిక్ ఫిగర్సే కానీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదని ఆమె తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa