హైదరాబాద్: కిలోమీటరుకు ప్రస్తుతం అమలులో ఉన్న రూ.11ను తగ్గిస్తూ రూ.7.25, రూ.6గా నిర్ణయించిన ప్రైవేటు క్యాబ్‌ల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న అర్ధరాత్రి నుంచి ఆటోలబంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్ల ఐకాస వెల్లడించింది. ఈ నెల 16న చలో అసెంబ్లీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపింది. మంగళవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐకాస కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ ఓలా, వూబెర్ క్యాబ్ సంస్థలు మోటారు వాహన చట్టం సెక్షన్ 67ను ఉల్లంఘిస్తూ క్యాబ్, ఆటో రేట్లను నిర్ణయిస్తూ సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నాయని ఆరోపించారు. 8వ తరగతి విద్యార్హత షరతు లేకుండా లైసెన్సు, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన ఆర్‌టీఏ ఫీజులను వెంటనే తగ్గించాలని కోరారు.