జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో పరీక్ష ప్రారంభం కాకముందే టెన్త్ పేపర్ లీక్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఓ గణిత ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ఇతరులకు పంపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన డీఈవో వెంకటేశ్వర్లు.. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa