ఇటీవల ఊపిరితిత్తులు, మూత్రపిండాల సంబంధిత సమస్యతో కిమ్స్ లో చేరిన దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ మధ్యే కోలుకున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు డా. అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో యువకళావాహిని నాగేశ్వరరావు నిర్వహిస్తున్న జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2016 వేడుకలో దాసరికి జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నారు. చిరు చేతుల మీదుగా ఈ పురస్కారం అందించనున్నట్టు తెలుస్తుంది. రవీంద్ర భారతిలో జరగనున్న ఈ కార్యక్రమానికి మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు హాజరు కానున్నట్టు సమాచారం. వీరితో పాటు బ్రహ్మానందం, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, జి. జగదీశ్వర రెడ్డిలు కూడా ఈ పురస్కార మహోత్సవానికి హాజరవుతారని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం డా. అల్లు రామలింగయ్య కళా పీఠం పలువురు ప్రముఖులను సత్కరిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa