వాషింగ్టన్/సిడ్నీ: ఇండోనేసియాలోని తానిబార్ దీవుల్లో సోమవారం ఉదయం 6.4 పాయింట్లతో భూమి కంపించినట్లు భూగర్భ సర్వే తెలిపింది. ఇది ఆ దీవులకు వాయువ్యంగా 222 కిలోమీటర్ల దూరాన నమోదైందని, అయితే ప్రాథమికంగా ఇంతవరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం రిపోర్టు కాలేదని, ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదని ఆ సర్వే వివరించింది. ఇదిలావుండగా ఆస్ట్రేలియాలో ఉత్తరాన డార్విన్ నగర తీరం బాండా సముద్రంలో 171.5 కిలో మీటర్ల లోతు కూడా భూమి కంపించిందని, అయితే సునామీ హెచ్చకలేమీ లేవని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa