జనగామ : చిల్పూరు మండలం పల్లగుట్టలో నిర్వహించిన శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు తనకు విడదీయలేని బంధం ఉందన్నారు. మీ ఆదరణతోనే ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగానని తెలిపారు. పల్లగుట్టకు సీతారాముల కల్యాణానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన గ్రామ పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. వచ్చే శ్రీరామనవమి నాటికి పల్లగుట్ట గ్రామంలో రాములవారి కల్యాణ మండపం నిర్మిస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa