జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేతలు అలీషా గిలానీ, యాసిన్ మాలిక్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన (ఫెమా) కింద కశ్మీర్ వేర్పాటువాద నేతలు సైయద్ అలీషా గిలానీ, యాసిన్ మాలిక్‌లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ అయిన మాలిక్ ను ఈనెల 28న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించిన ఈడీ, హురియత్ చైర్మన్ గిలానీని ఏప్రిల్ 3న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2001లో హైదర్ పొరాలోని గిలానీ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సమయంలో 10 వేల డాలర్లు పట్టుబడ్డాయి. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అన్న ప్రశ్నలకు గిలానీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ 2003లో ఐటీ శాఖ పంపిన సమన్లకు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఈడీ విచారించాలని భావించి, సమన్లు పంపింది. 2001లో పోలీసులు ముస్తాఖ్ అహ్మద్ డర్, ఆయన భార్య షిజియా రసూల్ ల నుంచి లక్ష డాలర్ల మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa