కేరళ: మిమిక్రి ఆర్టిస్ట్, జానపద గాయకుడు, ప్రముఖ మాజీ రేడియో జాకీ రాజేశ్ హత్యకు గురయ్యాడు. కేరళలోని తిరువనంతపురంలో గల తన స్టూడియోలో ఓ స్నేహితుడితో కలిసి ఉండగా సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో రాజేశ్ చనిపోగా అతని స్నేహితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దోహాలోని కేరళ ఎఫ్‌ఎంలో చేరేకంటే ముందు రాజేశ్ రెడ్ ఎఫ్‌ఎంలో ఎన్నో ఏళ్లుగా ఆర్‌జేగా పనిచేశాడు. ఇటీవలనే భారత్‌కు తిరిగి వచ్చి మిమిక్రి ట్రూప్‌లో చేరాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa