ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.26కే బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 04:20 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.26కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు రూ.26తో రీచార్జి చేసుకుంటే 2 రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. 150 ఎంబీ 2జీ/3జీ మొబైల్ డేటా లభిస్తుంది. ఇక దీంతోపాటు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1250కే 5 సంవత్సరాల వారంటీతో మోడెమ్‌ను అందిస్తున్నది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌కు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఆ తేదీలోగా రూ.249 ప్లాన్‌ను కస్టమర్లు పొందేందుకు వీలుంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు అన్‌లిమిటెడ్ నైట్ కాలింగ్ కస్టమర్లకు లభిస్తాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa