మేడ్చల్: ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్‌లో పోలీసులు ఓ వ్యక్తి వద్ద తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మెట్రో రైలు ఎక్కుతుండగా సతీశ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్‌లో తుపాకీతో తిరుగుతుండగా పోలీసులు సతీశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. భూపాలపల్లి జిల్లా కాటారానికి చెందిన ఓ నాయకుడి వద్ద సతీశ్ డ్రైవర్‌గా చేస్తున్నట్లు తెలిసింది. ఆ నాయకుడు లైసెన్స్‌డ్ తుపాకీని డ్రైవర్ సతీశ్‌కు ఇచ్చి బెంగళూరు వెళ్లినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa