హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంను చేపట్టారు. చెరువుల పరిరక్షణ, నాలాల శుద్ధి, కాలుష్య కారక పరిశ్రమల తరలింపు వంటి అంశాలపై సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. మానవ తప్పిదాల వల్లనే చెరువులు కలుషితం అవుతున్నయని మంత్రి అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132 చెరువులు ఉన్నట్లు తెలిపారు. మురుగు నీరు వల్ల చెరువులు కలుషితమయ్యాయన్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోపల 40 చెరువులను శుద్ధి చేస్తున్నామన్నారు. నగరంలోని చెరువులు శిఖం పట్టాల్లో ఉన్నయని చెప్పారు. 1,234 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నయని.. కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మూడు నెలల్లో 100 కాలుష్య కారక పరిశ్రమలను తరిలిస్తమని వెల్లడించారు. ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తమన్నారు. హైదరాబాద్‌లో 54 నాలాలు ఉన్నట్లు తెలిపారు. 90 శాతం సీవరేజ్ మూసీ నదిలోకి వెళ్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa