ఓ దేశ ప్రధాని మరో దేశానికి వెళ్లినపుడు ఎయిర్‌పోర్ట్‌లో ఓ సాధారణ పౌరుడిలాగా సెక్యూరిటీ చెక్ చేయడం ఎప్పుడైనా చూశారా? కానీ పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీకి మాత్రం అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఓ సగటు పౌరుడిలాగా ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్స్ అన్నింటినీ దాటుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని అప్పుడే కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ కథనం మాత్రం మరోలా ఉంది. అబ్బాసీ తన వ్యక్తిగత పని మీద అమెరికా వెళ్లారని, అందుకే ఇలా సెక్యూరిటీ చెక్‌కు సహకరించారని ఆ పత్రిక చెబుతున్నది. వ్యక్తిగత జీవితంలో అబ్బాసీ ఇలా నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతారని తెలిపింది. గత శనివారం ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే పాక్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులకు వీసాలు ఇవ్వకూడదని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa