ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరమైతే అమ్మ ఒడి వాహనాలను పెంచుతాం : లక్ష్మారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 12:52 PM

హైదరాబాద్ : శాసనమండలిలో అమ్మ ఒడి వాహనాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. పిల్లలకు వ్యాక్సిన్ల కోసం పలుమార్లు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. తల్లీపిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం 241 అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైతే అమ్మ ఒడి వాహనాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులను పెంచుతున్నామని ప్రకటించారు. నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. కొన్ని పోస్టుల విషయంలో కోర్టు కేసులున్నాయని తెలిపారు. జికా, ఎబోలా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరీక్షలు చేయడానికి గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు పంపుతున్నామని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa