ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు 90 శాతం పూర్తి: మంత్రి హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 02:39 PM

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసన మండలిలో హరీశ్‌రావు మాట్లాడుతూ… కృష్ణా జలాలు ఇరు రాష్ట్రాలకు 66-44 నిష్పత్తిలో త్రిసభ్య కమిటీ కేటాయించిందన్నారు. హైదరాబాద్‌ తాగునీటికి 5 టీఎంసీల నీటిని వదిలిపెట్టామన్నారు. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా కృష్ణాకు నీటిని తరలిస్తున్నందున రాష్ట్రానికి 45 టీఎంసీలు రావాలన్నారు. మిడ్‌ మానేరుకు ఏడాదిలోపు నీరందిస్తామని అన్నారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ మిడ్‌ మానేరు ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa