ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కరీంనగర్‌ సస్యశ్యామలం: హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 12:20 PM

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కరీంనగర్‌ సస్యశ్యామలం అవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లిdలో ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ… కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కరీంనగర్‌లోని ఏడు చెరువులకు నీళ్లు అందుతుందన్నారు. నాగులమల్యాల ద్వారా సాగునీరు, తాగునీరు ఇస్తామన్నారు. కొత్తగా వచ్చే ఓటీలను 4 మీటర్ల ఎత్తులోనే పెడుతున్నామని పేర్కొన్నారు. వరద కాల్వలో ఏడాదంతా నీళ్లు ఉంటాయన్నారు. వదర కాల్వల కింద ఉన్న చెరువులన్నీ నింపుతామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa