ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమాపణలు చెప్పిన డేవిడ్ వార్నర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 12:37 PM

 బాల్ ట్యాంపరింగ్ ఘటన పట్ల ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. ఆ ఉదంతంలో వార్నరే కీలక సూత్రధారి. చిన్ననాటి నుంచి తనకు క్రికెట్ అంటే ఇష్టమని, కానీ ఆ క్రీడకు మాయని మచ్చ తీసుకువచ్చానని వార్నర్ చెప్పాడు. కేప్‌టౌన్‌లో ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడవ టెస్టులో ఆసీస్ ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడారు. ఆ ఘటనలో స్టీవ్ స్మిత్, వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. సిడ్నీకి తిరిగి వెళ్తున్నానని, క్రికెట్‌కు నష్టాన్ని తీసుకువచ్చేలా తప్పులు చేశానని వార్నర్ తెలిపాడు. తాను చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెబుతున్నానని, దీని వల్ల ఆటకు, అభిమానులకు ఎంత నిరుత్సాహాం కలిగిందో తనకు తెలుసని, ఈ ఘటన నిజంగా క్రికెట్‌కు మచ్చను తీసుకువచ్చిందన్నాడు. 31 ఏళ్ల వార్నర్‌కు క్లబ్ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఉంది. కానీ ఈ ఉదంతం నుంచి కోలుకునేందుకు తనకు కొంత సమయం పడుతుందన్నాడు. కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఐడియాను వార్నర్ ఇచ్చాడని తెలుస్తోంది.














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa