పంజాబ్ రాష్ట్రమంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూ బ్యాంక్ అకౌంట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. 2014-15 సంవత్సరంలో దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్న్స్ లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై గతేడాది జనవరిలోనే సిద్ధూకు ఐటీ అధికారులు నోటీసులు పంపించారు. అదనంగా రూ.52 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుందని నోటీసులో తెలిపారు. ఆ నోటీసులపై సిద్ధూ అప్పీలుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషనర్ పన్ను కట్టాల్సిందేనని తీర్పు ఇచ్చారు. ఐటీ శాఖ వివరాలపై ప్రకారం.. 2014-15లో దుస్తుల కోసం రూ.28.38లక్షలు, టూర్ల కోసం రూ38.24లక్షలు, సిబ్బంది జీతాల కోసం రూ.47.11లక్షలు, పెట్రోల్, డీజిల్ కోసం రూ.17.80లక్షలు ఖర్చుపెట్టినట్లు ఐటీ రిటర్న్స్‌లో తెలిపారు. అయితే వీటికి సంబంధించిన పత్రాలను చూపించలేకపోయారు. ఇదిలా ఉంటే.. బ్యాంక్ అకౌంట్ల సీజ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కర్ణాటక ఎన్నికల్లో సిద్ధూతో ప్రచారం చేయిద్దామకుంటున్న తరుణంలో ఇలా జరగడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa