ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ లో పలుచోట్ల వడగళ్ల వాన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 01, 2018, 06:13 PM
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది.వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌,నాగోల్‌, రామంతాపూర్‌, సికింద్రాబాద్‌,  హయత్‌నగర్‌,ఖైరతాబాద్‌,  బేగంపేట, ప్యాట్నీ, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌, కుషాయిగూడ, పంజాగుట్ట,ఈసీఐఎల్‌, కాప్రా, ఏఎస్‌రావునగర్‌, నాచారం, చర్లపల్లి,  అశోక్‌నగర్‌, లాలాపేగ్‌, చిలకలగూడ, వారాసిగూడ, ముషీరాబాద్‌,సీతాఫల్‌ండీ, పార్శిగుట్ట, మారేడ్‌పల్లి, తుకారంగేట్‌, కార్ఖానా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. ఎండవేడిమితో అల్లాడుతున్న నగరవాసులకు అకాల వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. పలుచోట్ల రహదారులు తడిసి ముద్దవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో భారీ వర్షం కురిసింది. శంషాబాద్‌ మండలం కుమ్మరిగూడలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. సిద్దిపేట, నంగనూరు, సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, చందుర్తి మండలాల్లో, నల్గొండ జిల్లా దిండిలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక మండలాల్లో భారీ ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa