భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం పదిగంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. వార్డు ఎంపవర్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ప్రగతి మైదాన్‌లో జరుగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కొత్తగూడెం నుంచి పాల్వంచ వెళ్లే మార్గంలో మైనింగ్ కళాశాల పక్కన రూ.44 కోట్లతో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక్కడినుంచి మణుగూరుకు చేరుకొని కోడిపుంజుల వాగుపై నిర్మించిన వంతెన, రూ.23కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని, రూ.4కోట్ల వ్యయంతో నిర్మించిన 80 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారు. రూ.2.50 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మణుగూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa