ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాంచీ పిచ్‌ ఎవ్వరి వైపో?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 01:41 AM

   -ఆధిక్యంలో కోసం ఇరుజట్ల ఆరాటం
   -రెండో టెస్టు విజయంతో ఆత్మ విశ్వాసాన్ని  కూడగట్టుకున్న కోహ్లీసేన
   -భారత్‌ పుంజుకున్నందుకు ప్రత్యర్థుల కంగారు
   -మాటల తూటాలు పేల్చుతున్న ఆసీస్‌
   -ధీటుగా కౌంటర్‌ ఇచ్చిన టీమిండియా సారథి


రాంచీ : భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మరో సమరానికి ఆతిథ్యమిచ్చేందుకు రాంచీ సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సీరీస్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు టెస్టుల్లో చెరో విజయం సాధించిన ఇరుజట్లు రాంచీ టెస్టు పరీక్షను నెగ్గి సీరీస్‌ లో ఆధిక్యాన్ని నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ వంటి జట్లతో పాటు విదేశీగడ్డపై శ్రీలంకను కూడా మట్టి కరిపించ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియాను భారత్‌లో జరిగిన తొలి టెస్టులోనే మట్టి కరిపించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు... ఆ విజయం అందించిన ధీమాతో మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే ఒకింత ఓపిగ్గానే ఉంటూ... రెండో టెస్టులో తమదైన శైలిలో మ్యాచ్‌ని సొంతం చేసుకున్న కోహ్లీసేన మూడో టెస్టులోనూ కంగారూలకు పరాజయం తప్పదనే రీతిలో సిద్ధమైంది. రెండో టెస్టు పూరె్తైన మరునాటి నుంచే ప్రాక్టీస్‌కు ఉపక్రమించిన భారత్‌ జట్లు సభ్యులు రాంచీలో విజయం ఖాయమనే సందేశాన్ని ప్రత్యర్థి జట్టుకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే భారత పర్యటనకు రాకముందు వరకు తమది పేలవమైన ప్రదర్శన అనే విషయాన్ని స్వయంగా అంగీకరించిన ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ అందించిన విజయంతో మాటల తూటాలు పేలుస్తోంది. తొలి మ్యాచ్‌ ఫలితమే పునరావృత్తమవుతుందని ధీమాగా ఉంది.
జట్టులోకి మురళీ విజయ్‌
తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ విభాగంలో పూ ర్తిగా విఫలమైన భారత్‌కు కొంత ఉపశమనం లభిం చనుంది. భుజం గాయం కారణంగా మొదటి, రెం డో టెస్టుకు దూరమైన విజయ్‌ నేడు జరుగనున్న మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ పపథ్యంలో ఇన్నింగ్‌‌సకు గట్టి పునాది వేసే అవకాశం మెరుగైం ది. దీనికితోడు లోకేష్‌రాహుల్‌ రెండో టెస్టు నుంచి ఫామ్‌లోకి రావడం మరో శుభపరిణామం... కాగా ఈ సీరీస్‌లో కోహ్లీతో పాటు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్‌‌సమెన్‌ ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోవ డం ఆసీస్‌ బౌలర్లకు మరింత రెచ్చిపోయే అవకాశాన్ని పరోక్షంగా కల్పిం చినటై్లంది. ఆసీస్‌తో సీరీస్‌కు ముందు వరుసగా నాలుగు సీరీస్‌లలో నాలుగు డబుల్‌ శతకాలు సాధించిన కోహ్లీ... ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సీరీస్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలే కపోతున్నారు. ఈ వైఫల్యానికి ప్రతీకా రంతో రగిలిపోతున్న కోహ్లీ బ్యాటింగ్‌కు సహకరిస్తోందంటున్న రాంచీ పిచ్‌పై వికెట్‌ నిలుపుకొని ఆడితే కంగారూ బౌలర్లకు చుక్కలు కనబడక తప్పడు. ఇదిలా ఉంటే... తొలి టెస్టులో సమస్టిగా విఫ మైన భారత బౌలర్లు రెండో టెస్టులో పుంజుకోవడం శుభపరిణామం. రెండో టెస్టు విజయంతో సొంతమైన ఆత్మ విశ్వాసం రాంచీలో టెస్టుకు ధీమాను పెంచింది.
కష్టాల్లో ఆసీస్‌
తొలి టెస్టు విజయంతో జోరందుకున్న కంగారూ లకు రెండో టెస్టులో అనూహ్యంగా కోహ్లీ అండ్‌ కో చెక్‌ పెట్టింది. ఈ విజయంతో గాడినపడ్డ భార త్‌ను అడ్డుకోవడం అంత సులువు కాదని ఇప్పటికే ఆసీస్‌ దిగ్గజాలు స్టేట్‌మెంట్‌‌స ఇస్తుండగా... ఆ జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూర మయ్యారు. ప్రధానంగా ఆ జట్టులో కీలక ఆటగా డిన ఉండే మిచ్చెల్‌ స్టార్‌‌కతో పాటు మిచ్చెల్‌ మార్‌‌ష సైతం స్వదేశానికి పయనమవ్వడంతో ఆస్ట్రేలియా ను ఆందోళన కల్గిస్తోంది. వీరి స్థానాల్లో వేరొకరిని జట్టులోకి తీసుకున్నా... తుదిజట్టు ప్రకటించే వరకు ఎలాంటి మార్పులు చేయాల్సి వస్తుందో చెప్పలేని పరస్థితి.
పరుగులే పరుగులు : రవిశాస్త్రి 
రాంచీ పిచ్‌ సంప్రదాయబద్ధంగా ఉంది. తొలి ఇన్నింగ్‌‌సలో పరుగులు వరదలా పారే అవకాశం ఉంది. పిచ్‌ స్వభావా న్ని బట్టి అశ్విన్‌, జడే జాలకు కొంత వెసు లుబాటు ఇచ్చేందుకు మూడో స్పిన్నర్‌ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆరంభం నుం చే బౌలర్లకు సహకా రం లభించే అవకా శం తక్కువే. దీంతో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే భారీ ఇన్నింగ్‌‌స ఆశించవచ్చు. వీలైనంత తక్కువ స్కోరుకే ప్రత్యర్థులను కట్టడి చేయాలన్న వ్యూహాన్ని ఆసీస్‌ అమలు చేసే చాన్సుంది. అయితే లియాన్‌ చేతి గాయం స్మిత అండ్‌ కోను కంగారు పెట్టేదే..! ఇక జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ప్యాట్‌ కమిన్‌‌స తనదైన రీతిలో నిప్పులు చెరగడానికే ప్రయత్నిస్తాడు. ఓపెనింగ్‌లో రాహుల్‌తోపాటు మురళీ విజయ్‌ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. స్టార్‌‌క లేకపోవడంతో ఆసీస్‌ పేస్‌ బలం కొంత తగ్గినట్టే..! అలాగని హాజెల్‌వుడ్‌ని తక్కువగా అంచనావేస్తే ప్రమాదమే. కోహ్లీ కూడా మళ్లీ జోరు అం దుకుంటే టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఓపెనర్‌ వార్నర్‌ నుంచి ఆస్టలియా భారీ ఇన్నింగ్‌‌స ఆశిస్తోంది. అశ్విన్‌ జిత్తులమారి బౌలింగ్‌కు వార్నర్‌ చిత్తవుతున్నాడు. వార్నర్‌ బ్యాట్‌ను ఝుళిపిస్తే... పోటీ మరిం త ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. కోహ్లీ, స్మితలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకోరు. తుదికంటా విజయం కోసం పోరాడతారు. దీంతో రాంచీ టెస్‌‌ట మరింత రసవత్తరంగా జరుగుతుందనే అభిప్రాయం వెలిబుచ్చాడు.
ముమ్మర సాధన 
ఈ రోజు ప్రారంభం కానున్న మూడో టెస్టు నేపథ్యంలో రాంచీ చేరుకున్న భారత్‌, ఆస్ట్రేలి యా జట్లు ప్రాక్టీసు ముమ్మరంగా చేశాయి. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న రాం చీలోని జేఎస్‌సీఏ మైదానంలో భారత ఆటగాళ్లు బుధవారం వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రాక్టీ స్‌కే కేటాయించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డిం గ్‌ అన్ని విభాగాల్లోనూ ముమ్మర కసరత్తు చేశా రు. మొదటి రెండు టెస్టుల్లో రాణించని కోహ్లీ బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఎక్కువగా నెట్‌‌సలో బ్యాటింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సీరీస్‌లో ఇప్పటికే రెం డు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమఉజ్జీలుగా నిలి చాయి. దీంతో రాంచీ టెస్టుపై ఆసక్తి నెలకొంది. ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి సీరీస్‌ దక్కించు కోవాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి. ఇందుకోసం సారథులు కోహ్లీ, స్మిత్‌ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుం టుండడంతో రాం చీ టెస్టుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


మ్యాచ్‌ ఉదయం 9.30 నుంచి స్టార్‌ స్పోర్‌‌ట్సలో 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa