ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ జనసమితి ప్రజల కోసమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 12:25 PM

తెలంగాణ జన సమితి ప్రజల కోసమే ఆవిర్భవించిందని టీజేఏసీ జిల్లా కన్వీనర్, కో కన్వీనర్‌ పన్నాల గోపాల్‌రెడ్డి, పందుల సైదులు అన్నారు. సోమవారం కోదండరామ్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ జనసమితిని స్వాగతిస్తూ క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలతో ఏర్పడిన స్వరాష్టంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని, ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో వీరానాయక్, శ్రీనివాస్, రామానుజం, బుచ్చిరెడ్డి, యాదయ్య, నర్సిరెడ్డి, అశోక్, శంకర్, సైదులు, వెంకన్న, చారి, చిరంజీవి, మహేశ్, భానుప్రసాద్, ఉమమహేశ్వర్‌ తదితరులున్నారు.   










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa