ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పద స్థితిలో వివాహిత మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 12:34 PM

ఇటీవల కాలంలో క్షణికావేశంలోనే లేదా మరోదైనా ఇతర చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువైపోతోంది. తల్లిదండ్రులు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల చివరకు పిల్లలు అనాథలవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో గిట్టనివారు పగతో కడతేరుస్తున్నారు. అలా జరిగినా కూడా చివరకు బాధితులు మాత్రం పిల్లలే. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతంలో వైజాగ్‌కి చెందిన వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల్లోకెళితే....ఎర్రగడ్డలోని శంకర్‌లాల్ నగర్‌లో నివసించే వైజాగ్‌కి చెందిన సౌమ్య (28) హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె గొంతుపై దుండగులు దారుణంగా కత్తితో గాయం చేశారు. ఓ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేసే తన భర్త నాగభూషణం సోమవారం రాత్రి విధులకు వెళ్లిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట నుంచి గడి పెట్టి ఉండటంతో ఆమెను ఎవరో హత్య చేశారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సౌమ్య ఇంట్లో నుంటి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అప్పటికే మృతి చెందింది. సౌమ్య-నాగభూషణం దంపతులు నాలుగేళ్ల కిందట నగరానికి వచ్చారు. వీరికి ఏడిదిన్నర కుమారుడు ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa