ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందీప్‌నేను కలిసి చేసిన 3వ చి్త్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 01:49 AM

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకు డిగా, రెజీనా కథానాయికగా అశ్వనికు మార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాల పై లోకేష్‌ దర్శ కత్వంలో రూపొందిన చిత్రం 'నగరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ వ్యా ప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రి కేయుల సామావేశంలో హీరో సం దీప్‌ కిషన్‌, హీరోయిన్‌ రెజీనా తదితరులు పాల్గొన్నారు...
రెజీనా మాట్లాడుతూ - నగరం సినిమాకు అద్భుతమైన రెస్పాన్‌‌స వచ్చింది. నేను, సందీప్‌ కిషన్‌ చేసిన మూడో సినిమా ఇది. సినిమాకు ఇంత మంచి రెస్పాన్‌‌స రావడం ఎంతో హ్యా పీగా ఉంది. సినిమా తమిళ్‌ నెటివిటీతో ఉన్నా ప్రజలు ఎంతగానో ఆదరిస్తు న్నారు. ప్రేక్షకులు, విమర్శకులు సిని మాను ఎంతగానో ఆదరిస్తున్నారు. దర్శ కుడు లోకేష్‌ కనకరాజ్‌‌‌ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఇలాంటి సిని మాను ఆదిరిస్తున్న ప్రేక్షుకులకు థాంక్‌‌స`` అన్నారు.
    సందీప్‌కిష్‌‌న మాట్లాడుతూ - ``మా సినిమా పోస్‌‌ట ప్రొడక్షన్‌ సహా కొన్ని కారణాలవల్ల ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల „సమయంలో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్‌ కోసమని మలేషియాలో ఉన్నాం. అయితే సినిమా రిలీజైన తర్వాత సినిమా చాలా బావుందంటూ రివ్యూస్‌ కూడా వచ్చాయి. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఇలా ఆదరించడానికి ఏకైక కారణం కంటెంట్‌. తమిళంలో సినిమా మాసివ్‌ హిట్‌ అయ్యింది. తెలుగు హీరోకు తమిళంలో ఇంత పెద్ద హిట్‌ సినిమా రావడం ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్‌ కనకరాజ్‌ సినిమాను అద్భుతంగా తెర్కెక్కించాడు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa