హైదరాబాద్ : ఐపీఎల్ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ లో తెలుగులో ప్రసారం కానున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ ల తెలుగు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు. ఐపిఎల్ సీజన్ 11 ఈ నెల 7 వ తేదిన ప్రారంభకానుంది.. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ప్రసారహక్కులను స్టార్ టివి స్వంతం చేసుకుంది.. ఈ నేపథ్యంలో ఈ ఐపిఎల్ మ్యాచ్ లకు తెలుగుతో కూడా ప్రత్యక్షప్రసారం చేయనుంది.. ఈ మ్యాచ్ లను స్టార్ మా మ్యాజిక్ ఛానల్లో ప్రసారం చేయనుంది.. తెలుగు కామెంటరీతో ప్రసారంమయ్యే ఈ క్రికెట్ మ్యాచ్ లకు మరింత ప్రాచూర్యం కల్పించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను బ్రాండ్ ఎంబాసిడర్ గా నియమించుకుంది.. అతడితో ఈ మ్యాచ్ సంబందించి ప్రొమోలను సైతం రూపొందించింది.. ఇక ఈ మ్యాచ్ ల గురించి ఎన్టీఆర్ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలుగు కామెంటరీతో ఈ మ్యాచ్ లు ప్రసారం చేయడం వల్ల ఈ మ్యాచ్ లో ఉండే మజాను బాగా ఎంజాయ్ చేయగలుగుతారని అన్నాడు.. ఈ ఐపిఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం తనకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.. ఈ సందర్భంగా ఐపిఎల్ తెలుగు మ్యాచ్ లపై రూపొందించిన ప్రొమోలను విడుదల చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa