హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ట్యాంక్ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన యంగ్ స్వీడిష్ డిజైన్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జేఎన్టీయూ సహకారంతో స్వీడన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వీడన్ రాయబారి క్లాస్ మోలిన్, జేఎన్టీయూ వీసీ కవితా దర్యానీ, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు ప్రదర్శన కొనసాగనుంది. స్వీడిష్ డిజైన్ వారోత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa