న్యూఢిల్లీ : రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వెంకయ్య ఆగ్రహం వెలిబుచ్చారు. దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆయా పార్టీల సభ్యులను ఉద్దేశించి వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని సభ్యులు నడుచుకోవాలని ఆయన సూచించారు. దేశం అభివృద్ధిని కోరుకుంటుందని వెంకయ్య తెలిపారు. సభ్యులు ఆందోళనలు విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెంయ్య నాయుడు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa