ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదుగురు సాధువులకు ఎంఒఎస్‌ హోదా కల్పించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 12:59 PM

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఐదుగురు సాధువులకు రాష్ట్రంలో సహాయ మంత్రుల (మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ – ఎంఒఎస్‌) కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నర్మదా నది చైతన్య కమిటీలోని నర్మదానంద్‌, హరిహరానంద్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూజీ మహరాజ్‌, యోగేంద్ర మహంత్‌లకు సహాయ మంత్రి హోదా కల్పించారు. గత మార్చి 31న వీరిని నర్మదా నది పరిరక్షణ కమిటీ సభ్యులుగా నియమించారు. వీరికి నేడు సహాయ మంత్రుల హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రుల హోదాలు వీరు నెలకు ఏడున్నర వేల రూపాయిల జీతం, ఇతర సౌకర్యాలు అనుభవిస్తారు. కాగా వీరికి సహాయ మంత్రి హోదా కల్పించడం ఎన్నికల జిమ్మిక్కుగా కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన పాపాలను కడిగేసుకోవడానికి చేపట్టిన చర్య అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది విమర్శించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa