ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామన్వెల్త్‌లో రజత పతకంతో భారత్ బోణి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 05, 2018, 08:58 AM

ఆస్ట్రేలియా‌లోని గోల్డ్‌కోస్ట్ వేదికగా ఆరంభమైన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకంతో భారత్ బోణి కొట్టింది. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో పోటీపడిన గురురాజా రజత పతకం గెలుపొంది మెగా టోర్నీలో భారత్‌కి తొలి పతకాన్ని అందించాడు. అతను పోటీలో మొత్తం 249 కేజీల బరువుని ఎత్తడం విశేషం. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ మెరిశారు. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో శ్రీలంకతో తలపడిన భారత జట్టు 5-0తో ఘన విజయాన్ని అందుకుంది. మహిళల సింగిల్స్‌ మిక్సెడ్ టీమ్‌ గ్రూప్-ఎ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-8, 21-4 తేడాతో శ్రీలంకకి చెందిన మధుషిక‌ని ఓడించగా.. కిదాంబి శ్రీకాంత్ 21-16, 21-10 తేడాతో శ్రీలంకకి చెందిన నిలుక కరుణరత్నెని వరుస సెట్లలో ఓడించాడు. బ్యాడ్మింటన్ డబుల్స్‌ మిక్సెడ్ టీమ్‌లోనూ అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడి.. 21-12, 21-14 తేడాతో శ్రీలంక‌ని ఓడించింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa