ఆసిఫాబాద్,మేజర్‌న్యూస్: ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాల్లో వర్షం కురిసింది. కాగజ్‌నగర్‌లో వడగళ్ల వాన పడింది. దీంతో భారీగా పంట నష్టం జరిగింది. ఇంకా పలుచోట్ల కూడా తీవ్ర నష్టం జరిగింది. అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలలో గురువారం ఉదయం అకాల వర్షం కురుస్తోంది. దీంతో కంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంది పంటను అమ్ముకోవడానికి అదిలాబాద్ మార్కెట్‌కు వచ్చిన రైతులకు వరణుడు తీరని నష్టాన్ని మిగిల్చాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కందులు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా శ్రీరాంపూర్‌లో గురువారం నాడు ఉదయం భారీ వర్షం కురిసింది. దాంతో ఓపెన్ కాస్ట్టలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వడగండ్ల వాన కురియడంతో ఆశ్రమ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. జైనురు మండలం పోచమ్మలొద్దిలో భారీ వర్షంతోపాటు వడగండ్లు పడ్డాయి. దీంతో ఆశ్రమ పాఠశాల పైకప్పు లేచి పోయింది. ఈ సంఘటనలో పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa