ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో భార్యతోనూ ఇమ్రాన్‌కు గొడవలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 02:17 PM

మాజీ క్రికెటర్‌, పాకిస్థానీ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఫిబ్రవరిలో మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు మూడో భార్యతోనూ ఇమ్రాన్‌కు గొడవలు మొదలయ్యాయట. ఉమ్మత్‌ అనే ఉర్దూ పత్రిక కథనం ప్రకారం..బుష్రా మొదటి భర్త ఖవార్‌ ఫరీద్‌ మనేకా కుమారుడికి ఇమ్రాన్‌కి గొడవలయ్యాయట.


పెళ్లికి ముందే తన బనీ గాలా(ఇమ్రాన్‌ నివాసం పేరు)లో బుష్రాకు సంబంధించిన వారెవ్వరూ ఉండకూడదని ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. కానీ బుష్రా తన మొదటి భర్త కుమారుడిని ఇంట్లోనే ఉండనిస్తున్నారు.ఇది ఇమ్రాన్‌కు నచ్చలేదు. మరో విషయమేంటంటే..బుష్రాకు కుక్కలంటే ఇష్టం లేదు. అందుకే ఇమ్రాన్‌ ఇష్టపడి పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను వేరొకరికి ఇచ్చేశారు. నమాజ్‌ చేసుకుంటున్నప్పుడు అవి అడ్డుపడుతున్నాయని ఇమ్రాన్‌తో గొడవపడ్డారు. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయాలన్నీ బయటికిరావడంతో నెటిజన్లు ఇమ్రాన్‌కు సలహాలు ఇస్తూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇమ్రాన్‌కి నిజమైన ప్రేమ, భార్య దొరుకుతుందా? అని ట్వీట్లు పెడుతున్నారు.


బుష్రా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలు. ఇమ్రాన్‌ ఖాన్‌ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్‌ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com