ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాట్ కోహ్లికి మాస్టర్ ప్రామిస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 02:33 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ ప్రామిస్ చేశాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్న కోహ్లి ఇప్పటికే వన్డేల్లో 35 సెంచరీలు పూర్తి చేశాడు. కోహ్లి ఇదే దూకుడు కనబరిస్తే.. సచిన్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయం. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. చర్చంతా అతడు ఎంత కాలంలోగా ఈ రికార్డ్‌ను అధిగమిస్తాడనే.కోహ్లి గనుక తన 49 సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేస్తే అతడితో కలిసి షాంపేన్ పంచుకుంటానని సచిన్ చెప్పాడు. విరాట్ నా రికార్డ్‌ను అధిగమిస్తే.. తనకు షాంపెన్ బాటిళ్లు పంపడం కాదు.. నేనే తన దగ్గరకెళ్లి షాంపెన్ బాటిల్ పంచుకుంటానని మాస్టర్ బ్లాస్టర్ చెప్పుకొచ్చాడు. 2017 ఆరంభం నుంచి ఇప్పటి వరకు కోహ్లి వన్డేల్లో 9 శతకాలు బాదాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ (30), సనత్ జయసూర్య (28) శతకాల రికార్డును ఈ ఏడాది కాలంలోనే బ్రేక్ చేశాడు. కాగా కోహ్లి వన్డేల్లో 62 సెంచరీలు సాధిస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. ‘రియల్ మాస్టర్ బ్లాస్టర్’ అంటూ కోహ్లి సచిన్‌కి బర్త్ డే విషెస్ చెప్పాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com