ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ తో కలిసి భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 03:31 PM

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలుగు సినీ పరిశ్రమకి చాలా దగ్గరగా ఉంటారనే విషయం తెలిసిందే. మంచి సినిమాలని ఎల్లప్పుడు ఆదరించే కేటీఆర్ ఇటీవల విడుదలైన భరత్ అనే నేను చిత్రాన్ని టీంతో కలిసి స్పెషల్ ప్రీమియర్ చూశారు. చిత్రానికి మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో కేటీఆర్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపారట. సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ లో మహేష్ మరియు కొరటాల శివని అభినందించారు. సినిమా చాలా ఎంజాయ్ చేశానని స్నేహితుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో ఇంటరాక్షన్ జరిపినట్టు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.హీరో మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి మినిస్టర్ కేటీఆర్ జరిపిన ఇంటరాక్షన్ లో సినిమాలో ఉన్న అంశాలతో పాటు రియల్ లైఫ్ లో తాను ఫాలో అవుతున్న పద్దతులు ప్రస్తావనకి వచ్చినట్టు తెలుస్తుంది. ఓ మంచి కాజ్ కోసం కేటీఆర్ తొలి సారి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ పలు టీవీ ఛానెల్స్ లో ప్రసారం కానుంది. భరత్ అనే నేను చిత్రం ఓ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కగా ఇందులో మహేష్ యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా కనిపించాడు. చిత్రంలో భరత్ పాత్ర పోషించిన మహేష్ అభిమానుల మనసులనే కాదు నిజమైన రాజకీయ నాయకులను కూడా మెప్పిస్తున్నాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com