జేడీఎస్ నేత కుమారస్వామి రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విధాన సౌధ బయట మెట్లపై సాయంత్రం 4.30 గంటలకు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా, రాహుల్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లను ఆహ్వానించారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులతో పాటు మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు కూడా హాజరు కానున్నారు.