ఆరుదైన శస్త్ర చికిత్స చేసి చరిత్ర సృష్టించారు.

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 04:22 PM
 

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరోసారి ఆరుదైన శస్త్ర చికిత్స చేసి చరిత్ర సృష్టించారు. 60 ఏళ్ల వృద్దురాలు ఆఫిజా బేగంకు గాల్ బ్లాడర్ కేన్సర్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఈ శస్త్ర చికిత్స కోసం సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి ఎంతో సహకరించారని వైద్యులు తెలిపారు. ఇంకా ఎన్నో ఆరుదైన శస్త్ర చికిత్సలు చేయగలమని పేర్కొన్నారు. ఆఫిజా శస్త్ర చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యేదని తెలిపారు. రూ.15 లక్షల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించిందన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆఫిజా బేగం పేర్కొన్నారు.