ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాయకుడిపై నోట్లు విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 03:14 PM

గుజరాత్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్పేశ్ థాకూర్ ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించారు. పటాన్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాధాన్‌పూర్ ఎమ్మెల్యే అల్పేశ్ థాకూర్.. డైరో అనే పేరుతో జరుగుతున్న ప్రోగ్రామ్‌లో రూ.10 నోట్లను విసురుతూ కనిపించారు. ఈ విషయంపై ఆ ఎమ్మెల్యే మాట్లాడేందుకు సంకోచించ లేదు. తనకు ఆర్బీఐ నియమాలు తెలుసునని, కానీ ఆడ పిల్లల చదువు కోసం ఆ డబ్బును వాడనున్నట్లు ఆయన తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com