తెలంగాణ పోస్టల్ శాఖలో 645 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 06:24 PM
 

హైదరాబాద్ : తెలంగాణ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ వ్యాప్తంగా 645 ఉద్యోగాలను పోస్టల్ శాఖ భర్తీ చేయనుంది. ఓపెన్ కేటగిరి 356, ఓబీసీ 151, ఎస్సీ 86, ఎస్టీ 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత పదో తరగతి. వయస్సు 18 నుంచి 40 ఏళ్లు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 19. ఇతర వివరాల కోసం


https: //indiapost.gov.in or https://appost.in/gdsonline వెబ్‌సైట్‌ను సందర్శించాలి.