విజయ్‌ హజారే ట్రోఫీ విజేత తమిళనాడు
Updated: Mon, Mar 20, 2017, 07:52 PM

దిల్లీ: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడు-బంగాల్‌ జట్ల మధ్య సోమవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 37పరుగుల తేడాతో విజయం సాధించింది.టాస్‌ గెలిచిన తమిళనాడు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 47.2ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్‌ అయింది. దినేశ్‌ కార్తీక్‌ అత్యధికంగా 112 పరుగులు సాధించాడు. 218పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగాల్‌ జట్టు 45.5ఓవర్లలో 180పరుగులకే చేతులెత్తేసింది. దీంతో తమిళనాడు జట్టు బంగాల్‌పై 37పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

Telangana E-Paper