టిఆర్‌ఎస్‌ సర్కార్‌పై ప్రజలలో వ్యతిరేకత ఉంది

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 21, 2017, 01:05 AM
 

   మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధి: టిఆర్‌ఎస్‌ రెండేళ్ల పాలనలో సాదించిన ప్రగతి పై శ్వేతపత్రం విడుదల చేయాలని పిసిసి మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. హన్మకొండలోని పొన్నాల నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖ రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాటలతోనే కెసిఆర్‌ సర్కార్‌ గార ఢీ చేస్తుందని మండిపడ్డారు. 


   కమలాపూర్‌లోని ఎపి రేయాన్స్‌ ఫ్యాక్టరీని పునరుద్దరించడంలో మంత్రులిద్దరు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలసరి జీతాలు అడిగిన కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. వరంగల్‌ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పేద ప్రజలకు వైద్య సేవలందించేందుకు చేపట్టిన ఆరోగ్య శ్రీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తున్నారన్న పొన్నాల మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసి తులకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టకుండా అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడి స్థానికులు గత ఆరునెలలుగా ఉద్యమాలు చేస్తున్న పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొంతమంది కావాలనే బస్సును తగులబెట్టి జెఎసి నాయకులపై కేసులు మోపారని ఆరోపించారు. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలతో సర్కారు దిగరాకపోతే ఉద్యమాన్ని ఉదతం చేస్తామని హెచ్చరించారు. మిషన్‌ కాకతీయలో అనేక అక్రమాలు చోటుచేసు కున్నాయని విమర్శించారు. 


    తాము సర్కారు పై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామన్న పొన్నాల వాటిని నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. కెసిఆర్‌ కుటుంబ సభ్యుల చేతిలో తెలంగాణ బందీ అయిందన్న ఆయన విడిపించేందకు ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్‌, పోడెం వీరయ్య, రాజనాల శ్రీహరి, బత్తిని శ్రీనివాసరావు, ఇవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.