తెర పైకి త్రివిక్రమ్ నాని

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 21, 2017, 01:24 AM
 

వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి మరో మంచి ఆఫర్‌ దక్కింది. మాటల మాంత్రి కుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిల్‌‌మనగర్‌లో టాక్‌ వినిపి స్తోంది. అయితే విక్రమ్‌ దర్శకుడిగా కాదండోయ్‌, కేవలం నాని సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించ బోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయబో యేది మాత్రం శ్రీనివాస్‌ అవసరాల అని ఫిల్‌‌మన గర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి అష్టాచమ్మా సినిమాతో హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. శ్రీనివాస్‌ ఊహలు గుసగుసలాడే సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు. వీరిద్దరికి మంచి అనుబంధంతో ఎప్పటినుండో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా శ్రీనివాస్‌ అవసరాల త్రివిక్రమ్‌కి ఒక కథ చెప్పాడని, త్రివిక్రమ్‌ కూడా కథ నచ్చడంతో ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్‌ చేస్తానని మాట ఇచ్చాడు అని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ కథకు నాని అయితేనే కరె్‌‌టగా సరిపోతాడని, స్టోరీని ఫైనల్‌ చేసి త్వరలో ఈ సినిమాని మేలో స్టార్ట్‌ చెయ్యబోతున్నారని సమాచారం.