టీఆర్‌జేసీసెట్-2017 నోటిఫికేషన్‌ను విడుదల

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 21, 2017, 07:46 AM
 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం టీఆర్‌జేసీసెట్-2017 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష మే 10న నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు జరుగనున్నది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ధర రూ.150గా నిర్ణయించారు.