హైదరాబాద్: బహదూర్‌పురాలో బుధవారం ప్రమాదం సంభవించింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. సీసీఫుటేజ్‌లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురవడం స్పష్టంగా కనిపించింది. రోడ్డు పక్క బైక్‌పై ఉన్న వ్యక్తి సెల్ఫోన్లో మాట్లాడుతూ..క్రాస్‌గా రోడ్డు దాటుతుండగా..ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో అతని బ్రెయిన్ డెడ్ అయ్యింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య వాహనదారుడున్నాడు.