భద్రాద్రికొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పలు చోట్ల నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షం ధాటికి జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపోతున్నాయి. కిన్నెరసానిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్నది. పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేశారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. తాలి పేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది.