ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలించిన స్టేట్ నోడల్ అదికారి డాక్టర్ రాంబాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 14, 2018, 02:28 PM

కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా కాపుగల్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని  కంటి వెలుగు స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా  కంటివెలుగు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు . కంటివెలుగుకు సంబంధించిన ముద్రణా ప్రతులను ఆవిష్కరించారు . ఈ సంధర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 26 బృందాలను సిద్ధం చేసినట్లు, రోజుకి 250 -300 మందికి చూడడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోదాడ మండల పరిధిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కాపుగల్లు లో కంటివెలుగును ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ .బి .యస్ .కె జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ ఉదయ లక్ష్మీ , లక్ష్మీ నర్సమ్మ తిరుపతయ్య శ్రీనివాస్ రూప తదితరులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com