హైదరాబాద్: నగరంలో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రమాదవశాత్తు బస్సులో నుంచి కింద పడిపోయాడు. వేవ్ రాక్ కూడలి వద్ద బస్సు టర్న్ అవుతుండగా కండక్టర్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కండక్టర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.