ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 11:15 AM

గద్వాల :  జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువప్రాంతాలతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు నుంచి 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 9.45 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. రానున్న రెండ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com