భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్ కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం ప్రాజెక్టు కు వరద పోటెత్తడంతో 17 గేట్లద్వారా 1 లక్షా 42 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేసిన విషయం విధితమే. శుక్రవారం వరద తగ్గడంతో అధికారులు 22 గేట్ల ద్వారా 32 వేల 500 క్యూ సెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.